భయం భయం భయం
నరం నరం తెన్చేస్తూ
యేద సవ్వడి సైతం
భయంకరమై వినిపించే వైనం
మరల రమ్మని వేడుకుంటూ చెబుతున్న
చిగురించే ధైర్యాన్ని త్రుటిలోనే తేన్చేస్తూ
పొంగుకోచే శౌర్యాన్ని నిష్కర్షగ అనిచేస్తూ
వెంటాడే నీడ వలె అనుక్షణం వెంబడిస్తే
కంటనీరు తోడూ కూడా కరువైన నిమిషానా
అనుభవమే ఒదరుపై, ఆలోచనే ఆయుధమై
కాలాన్నే వెంటాడే సహనమే సొంతమైతే
నే వేసే ప్రతి అడుగుతో
భయపెట్టన ఆ భయాన్ని సైతం
భయం భయం భయం
అంటూ భయపడేలా ......
మరొకని భయపెట్టకుండా తన జీవితాంతం భయపడేలా....