Monday, May 28, 2007

నేను సగటు మనిషిని.........................

చీకటిని చీలిచే కిరాణానికి
తీరం చేరే కెరటానికి
గమ్యం వైపు పయనించే బాణనికి
మార్గదర్శిని కావాలని

వినీల ఆకాశం లో
విహరించే విహంగం పై
స్వారి చేస్తూ ప్రపంచాన్ని చుట్టేయాలని

అవినీతి అన్యాయం రక్కసూలై
సమాజాన్ని కబలిస్తుంటే
మత పిచ్చి మహమ్మారి అయి
సగటు మనిషి జీవితం తో ఆడుకుంటుంటే

ఉద్యమం తో ఉదయించే సూర్యుడిని కావాలని
ఎగిసి పడే అగ్నిశిఖలలతో దహించి వేసే అగ్ని పర్వతం కావాలని
మర్రి చెట్టు ల పాతుకు పోయిన సమాజ అసమానతలను కూకటి వెళ్లతో పెకిలించే సుడి గాలిని కావాలని
ఆశ పడ్డాను...... పడుతూ ఉన్నాను .........
ఒక్కసారి నిజం కన్నుల ముందు మెదిలే సరికే
నేను ఒక సగటు జీవిని అని
నా పరిదిని దాటి జీవించ లేని మామూలు మనిషి అని
గురుతుకు వచ్చే ప్రతి క్షణం
నా అసహాయాతకు సిగ్గు పడుతున్నాను
ఎందుకంటే నేను సగటు మనిషిని కేవలం సగటు మనిషిని.........

2 comments:

Pramod said...

Hey
i didnt expect such a good vocabulary from u

but keep an eye on spelling mistakes.
but a good attemp keep going
all the best!

Krishna said...

nice one raa
jus conversion mistakes
best of luk

నా గురించి.............

Hi Guys, This is Naveen Kandagatla. Dance, Listening music, watching movies are my hobbies. I love to spend time with my family & friends. Currently I am working as a Senior Software Engineer in MNC.